జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్.. సన్నిహితులతో సాయిరెడ్డి! ఎప్పుడంటే?
Fri May 30, 2025 06:55 Politics.202505305760.jpg)
ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి, వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై ఈ మధ్యే జగన్ కూడా స్పందించారు.
అరెస్టుకు భయపడేది లేదని, తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ ను అరెస్టు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే తిరుపతి వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంలో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో వారికి వెల్లడించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ ను సీఐడీ వచ్చే నెల 10వ తేదీ లోపు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుస్తోంది. అయితే సాయిరెడ్డి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. తనను కెలకొద్దని మాత్రం ఇప్పటికే వైసీపీలో జగన్ కోటరీగా ఆరోపిస్తున్న వారికి హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత వైసీపీ కూడా సైలెంట్ గా ఉంటోంది. అయితే సాయిరెడ్డి చెప్పిన సమాచారం నిజమే అయితే మాత్రం జగన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఓసారి మద్యం స్కాంలో సాక్షిగా హాజరై సీఐడీ సిట్ కు పలు వివరాలు వెల్లడించిన సాయిరెడ్డి.. ఇప్పుడు ఈ స్కాంలో జగన్ అరెస్టుపై చెప్పారని భావిస్తున్న రహస్య సమాచారంపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #JaganArrest #SajjalaRamaKrishnaReddy #YSRCP #APPolitics #BreakingNews #PoliticalUpdates #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.